Verse
చూడుము సోదరుడా నీవు - నేడే లేచి రక్షణ కొరకై
వేడుము స్నేహితుడా
Verse
లెమ్ము నీకు వెలుగువచ్చెను - కమ్ముచున్నది చీకటి లోకమున్
చిమ్మచీకటి జనముల గమ్మెను - నెమ్మది నొందగ లేచి రా
నమ్ముము సోదరుడా
Verse
దేవుని వాక్యము వెలుగైయున్నది - ఆ వెలుగే నీకు జీవమైయున్నది
నీ వెనుకే ఆ జీవము నిలచెను - జీవము నొందగ వేగమే రా
రావో సోదరుడా
Verse
నిలువుము నీ జీవము ఆవిరియే - ఇలలో లేదిక నీదని చెప్పెడు
కలుషము లెల్లను కడుగును క్రీస్తు నిలుచును ఇల నీ కాపరియై
కలువరి చెంతకు రా
Verse
మొర్రపెట్టుము నేడే లేచి - సరిచేసికొని జీవితమంత
పరిశుద్ధ రక్తధారలతో - పరిశుద్ధుడు నిలచెను నీకై
పరుగిడిరా ప్రియుడా
Verse
యేసుని నమ్మెడి వారిలలోన - యేసుని జీవము పొందిన వారై
భాసురంబుగా మోక్షము జేర - నిల్చెదరు శక్తిని బొంది
యేసే ఒసగును రా
Verse
హల్లెలూయ పాడుము నేడే - వల్లభుండేసు వచ్చునని
ఎల్ల ప్రజలు చూచెద రేసున్ - చల్లని ప్రభూరాకన్ ఇలలో
స్తుతులను పాడను రా