Verse
క్రిస్మస్ కాలం క్రీస్తు జననం – ఎంతో ఆనందమే
రాజాధిరాజు ప్రభువుల ప్రభువు – ధరకేతెంచెలే‖ 2x ‖
ఎంతో ఆనందమే – రారాజు నీ జన్మమే
ఎంతో సంతోషమే – ఆ ప్రభుని ఆగమనమే‖ 2x క్రిస్మస్ కాలం ‖
Verse
పరిశుధ్ధుడు జన్మించెను – పశువుల పాకలో
లోకాలనేలే రారాజుగా – ఆ బెత్లేహేములో‖ 2x ‖
యూదా గోత్రములో – ఒకతార కాంతిలో‖ 2x క్రిస్మస్ కాలం ‖
Verse
కాపరులు చాటించిరి – లోకాన శుభవార్తను
బంగారు సాంబ్రాణి బోళములు – అర్పించిరి జ్ఙానులు‖ 2x ‖
దూతలు స్త్రోత్రించిరి – ఆ ప్రభుని ఘనపరచిరి‖ 2x క్రిస్మస్ కాలం ‖
Verse
ఆ ప్రభువు జన్మించెను – నరరూపధారిగా
మన పాప పరిహార బలియార్ధమై గొఱ్ఱేపిల్లగా
ఆ ప్రభువు జన్మించెను – నరరూపధారిగా
మన పాపాన్ని తొలగించి రక్షింపగా మరియ సుతునిగా‖ 2x ‖
ఎంతో ఆనందమే – రారాజు నీ జన్మమే
ఎంతో సంతోషమే – ఆ ప్రభుని ఆగమనమే‖ 2x క్రిస్మస్ కాలం ‖