Lyrics Lake
SearchLyricsTags
  1. Home
  2. /
  3. Lyrics
  4. /
  5. Christmas Medley 1

క్రిస్మస్ మెడ్లీ 1

Christmas Medley 1

Verse
నజరేతు పట్నాన నాగుమల్లె ధరణిలో
యోసేపు మరియమ్మ నాగుమల్లె ధరణిలో‖ 2x ‖
హల్లెలూయా హల్లెలూయా‖ 4x ‖
Verse
మేము వెళ్లి చూచినాము స్వామి యేసు నాథుని‖ 2x ‖
ప్రేమ మ్రొక్కి వచ్చినాము మామనంబు లలరగా‖ 2x ‖
బేతలేము పురములోన బీద కన్య మరియకు‖ 2x ‖
పేదగా సురూపు దాల్చి వెలసె పశుల పాకలో‖ 2x ‖
Verse
పేద వడ్ల వారి కన్య మరియమ్మ
ప్రేమ గల యేసు తల్లి మరియమ్మ
ప్రేమ గల యేసు తల్లి
పేరెళ్ళిన దేవా దేవుడే
యేసయ్య.. ప్రేమ గల అవతారం‖ 2x ‖
స్వర్గ ద్వారాలు తెరిచిరి
యేసయ్య… స్వర్గ రాజు పుట్టగానే
యేసయ్య… స్వర్గ రాజు పుట్టగానే
సరుగున దూతలు వచ్చిరి
యేసయ్య.. చక్కని పాటల్ పాడిరి‖ 2x ‖
Verse
నువ్వు బోయే దారిలో యెరూషలేం గుడి కాడ‖ 2x ‖
అచ్ఛం మల్లె పూల తోట యేసయ్య‖ 2x ‖
దొడ్డు దొడ్డు బైబిళ్లు దోసిట్లో పెట్టుకొని‖ 2x ‖
దొరోలే బయలెల్లినాడే యేసయ్య‖ 2x ‖
Verse
రాజులకు రాజు పుట్టన్నయ్య‖ 2x ‖
రారే చూడ మనం వెళ్లుదాం అన్నయ్య‖ 2x ‖
తారన్ జూచి తూర్పు జ్ఞానులన్నయ్య‖ 2x ‖
తరలినారే బెత్లహేము అన్నయ్య‖ 2x ‖
Verse
పదరా పోదాము రన్న
శ్రీ యేసుని చూడ
పదరా పోదాము రన్న‖ 2x ‖
Verse
శ్రీ యేసన్న నట లోక రక్షకుడట‖ 2x ‖
లోకులందరికయ్యె ఏక రక్షకుడట‖ 2x ‖
పదరా.. హే – పదరా.. హే
పదరా పోదాము రన్న – శ్రీ యేసుని చూడ
పదరా పోదాము రన్న‖ 4x ‖

Related Tags

JesusChristmasNativity