Lyrics Lake
SearchLyricsTags
  1. Home
  2. /
  3. Lyrics
  4. /
  5. Christmas Medley 3

క్రిస్మస్ మెడ్లీ 3

Christmas Medley 3

Verse
దూత పాట పాడుడీ – రక్షకున్ స్తుతించుడీ
ఆ ప్రభుండు పుట్టెను – బేత్లెహేము నందున
Verse
ఓ బేత్లెహేము గ్రామమా! సద్దేమిలేకయు
నీవొంద గాఢనిద్రపై – వెలుంగు తారలు
Verse
ఓ సద్భక్తులారా! లోక రక్షకుండు
బేత్లెహేమందు నేడు జన్మించెన్
Verse
శ్రీ రక్షకుండు పుట్టఁగా నాకాశ సైన్యము
ఇహంబున కేతెంచుచు ఈ పాట పాడెను
Verse
నమస్కరింప రండి నమస్కరింప రండి
నమస్కరింప రండి యుత్సాహముతో
Verse
ఆ దేశములో కొందరు గొర్రెల కాపరులు
పొలములలో తమ మందలను కాయుచునున్నప్పుడు
Verse
భూనివాసులందరు – మృత్యు భీతి గెల్తురు
నిన్ను నమ్మువారికి – ఆత్మ శుద్ధి కల్గును
Verse
జ్ఞానులారా మానుడింక యోచనలన్ జేయుట
మానుగాను వెదకుడేసున్ చూచుచు నక్షత్రమున్
Verse
సద్దేమి లేక వచ్చెగా! ఈ వింత దానము
ఆరీతి దేవుడిచ్చుపై వరాల్ నరాళికి
Verse
రండి నేడు పుట్టినట్టి
రాజునారాధించుడి‖ 2x ‖
Verse
నీకు నమస్కరించి నీకు నమస్కరించి
నీకు నమస్కరించి పూజింతుము
Verse
యేసు పుట్టగానే వింత‖ 2x ‖
ఏమి జరిగెరా దూతలెగసి వచ్చెరా‖ 2x ‖
నేడు లోక రక్షకుండు‖ 2x ‖
పుట్టినాడురా ఈ పుడమి యందున‖ 2x ‖
Verse
పశువుల పాకలో పచ్చగడ్డి పరుపులో‖ 2x ‖
పవళించెను… పవళించెను…
పవళించెను నాథుడు మన పాలిట రక్షకుడు‖ 2x ‖
Verse
దూతల గీతాల మోత విను బేతలేమా
పరమ దూతల గీతాల మోత విను బేతలేమా
ఎన్నెన్నో యేడుల నుండి నిరీక్షించినట్టి‖ 2x ‖
పరమ దూతల గీతాల మోత విను బేతలేమా‖ 2x ‖

Related Tags

WorshipChristmasNativity