Lyrics Lake
SearchLyricsTags
  1. Home
  2. /
  3. Lyrics
  4. /
  5. Christmas Subhavelalo Mana Andhari Hrudhayaalalo

క్రిస్మస్ శుభవేళలో మన అందరి హృదయాలలో

Christmas Subhavelalo Mana Andhari Hrudhayaalalo

Lyricist: Suresh Nittala
Verse
క్రిస్మస్ శుభవేళలో – మన అందరి హృదయాలలో
ఆనందమానందమే – మనసంతా సంతోషమే
Chorus
స్తుతియించి ఆరాదిద్దాం
ఆ ప్రభుని ఘనపరచి కీర్తించుదాం
రక్షకుడు పుట్టాడని – మనకు రక్షణ తెచ్చాడని
Verse
దావీదు పురమందు రక్షకుడు
మన కొరకై జన్మించాడు
దేవాధిదేవుని కుమారుడు రిక్తునిగా భువికొచ్చాడు
ఆ ప్రభువే నరుడాయెను – లోకమును ప్రేమించెను
మన పాపము తొలగించెను – పరిశుథ్థులుగా చేసెను
సర్వోన్నతమైన స్థలములలో – దేవునికే మహిమ
ఆనందమే ఆశ్చర్యమే – సంతోషం సమాధానమే
దూతాళి స్త్రోత్రించిరి – కాపరులు చాటించిరి
ప్రభుయేసు పుట్టాడని – మనకు తోడై ఉంటాడని
వింతైన తార వెలసిందని – ఙ్ఞానులు కనుగొంటిరి
ఆ తార వెంబడి వారొచ్చిరి – ప్రభుయేసుని దర్శించిరి
రాజులకే రాజని – ప్రభువులకే ప్రభువని
కానుకలు అర్పించిరి – వినమ్రతతో పూజించిరి

Related Tags

WorshipChristmasCelebration