Verse
పల్లవి:
చూడుము గెత్సెమనె - తోటలో నా ప్రియుడు
పాపి నాకై విజ్ఞాపన చేసెడి - ధ్వని వినబడుచున్నది
Verse
దేహమంతయు నలిగి - శోకము నొందినవాడై
దేవాది దేవుని ఏకసుతుడు పడు - వేదనలు నా కొరకే
...చూడుము...‖ చూడుము ‖
Verse
తండ్రి యీ పాత్ర తొలగన్ - నీ చిత్తమైన యెడల
ఎట్లయినను నీ చిత్తము చేయుటకు - నన్నప్పగించితివనెను
...చూడుము...‖ చూడుము ‖
Verse
రక్తపు చెమట వలన - మిక్కిలి బాధనొంది
రక్షకుడేసు హృదయము పగులగ - విజ్ఞాపనము జేసెనే
...చూడుము...‖ చూడుము ‖
Verse
ముమ్మారు భూమి మీద - పడి మిక్కిలి వేదనచే - మన
యేసు ప్రభువు తానే వేడుకొనెను - పాపుల విమోచన కొరకే
...చూడుము...‖ చూడుము ‖
Verse
ప్రేమతో కూడిన వాక్కులచే - ఆదరించెడి ప్రభువు
వేదన సమయమున ఆదరించువారు - లేక బాధనొందెను
...చూడుము...‖ చూడుము ‖
Verse
నన్ను తన వలె మార్చెడి - ఈ మహా ప్రేమను
తలచి తలచి హృదయము కరుగగా - నే సదా కీర్తించెదను