Lyrics Lake
SearchLyricsTags
  1. Home
  2. /
  3. Lyrics
  4. /
  5. Chupinava Needu Prema

చూపినావా నీదు ప్రేమ

Chupinava Needu Prema

Chorus
చూపినావా నీదు ప్రేమ సిలువ పైన యేసునాథ
చూపినావా నీదు కరుణ పాపినైన నామీద
Verse
గాయపరచబడితివా
నా అతిక్రమములకై
నలుగగొట్ట బడితివా
నా దోషముల కొరకై
సొగసైన సురూపమైన
లేనివానిగా చేయబడితివా
లేనివానిగా చేయబడితివా
Chorus
చూపినావా నీదు ప్రేమ సిలువ పైన యేసునాథ
Verse
తలను ముండ్ల కిరీటము
కాళ్ల చేతులు శిలలు నా పాపముల కొరకై
ఘోరమైన సిలువ మరణం
భరించితివా నా కొరకై
ఘోరమైన సిలువ మరణం
Chorus
చూపినావా నీదు ప్రేమ సిలువ పైన యేసునాథ
Verse
అప్పగింప బడితివా నా అపరాధములకై
పునరుద్దానమైతివా
నన్ను నీతి గాను చేయ
దాసునిగాను రిక్తునిగాను చేసుకొంటివా నా కొరకై
చేసుకొంటివా నా కొరకై
Chorus
చూపినావా నీదు ప్రేమ సిలువ పైన యేసునాథ
చూపినావా నీదు కరుణ పాపినైన నామీద

Related Tags

CrossGood FridaySacrificeJesus Christ