Verse 1
నీ... ధర్మశాస్త్రమునందు
ఆశ్చర్యకరమైన సంగతులను చూచునట్లు
నా కన్నులు తెరుపుము - 6
Verse 2
ఎడారిలో హాగరు కన్నులు చూచె నీటి ఊటను
దాహార్తిని తీర్చి నీవు కాచితివి దాసి బాటను
సేదతీర్చి ఆదరించగ పంపినావు నీదు మాటను
మాటయందు మహిమను చూడగ ||నా కన్నులు ||
Verse 3
ఎలీషా శిష్యుని కన్నులు కాంచె అగ్నిరధములను
ముదముతోడ తెరిపించితివి - అంతరాత్మ నయనమ్ములను
అంధత్వము బాపిన నీదు అందమైన కార్యమ్ములను
అనవరతము అన్వేషించగ ||నాకన్నులు ||
Verse 4
దమస్కులో దృష్టిని పొంది పౌలు చాటె సువార్తను
సమస్తమును నష్టమనెంచి వెంబడించె ఆత్మను
ప్రశస్తమగు ప్రేమయే శ్రేష్టంబని చాటెను
శ్రమలయందు సంతోషించగ ||నా కన్నులు ||