Verse 1
యేసు నామమున్ చాటెదము
అందు మనకు జయము జయమే - హల్లెలూయ - హల్లెలూయా - 2
Verse 2
అన్ని నామముల కన్న పైనున్న నామం
అతి ఉన్నతమైన అద్భుత నామం
కష్ట నష్టనారోగ్యములన్ని వీడిపోవును
దుఃఖ జీవితం సంతోషమయ మగును
నూతన జీవమిచ్చును నిరంతరము నడుపును ||యేసు ||
Verse 3
అన్నినామములకన్న బలమైన నామం
మహోన్నతమైన ఘననామం
అంధకార శక్తులు వణకిపారిపోవును
సాతాను దుర్గము పడద్రోయబడును
నూతన బలమిచ్చును జయజీవితమునిచ్చును ||యేసు ||