Verse 1
కడవరి కాలం మరి కలుషితకాలం
నీతిని అవినీతిగా దుర్నీతిని మంచిగా
చెప్పుకొనుచు తప్పుకొని తిరిగెడి కాలం
Verse 2
చదువులందు పదవులందు అధికులైనను
విధములు పలువిధములుగా మరలుచుందురు
విధి ధర్మమునెదిరించి వదరు చుందురు
హృదిని మదిని దైవ భయములేక యుందురు ||కడవరి ||
Verse 3
ఒకరినొకరు పొసగకయే మసలుచుందురు
పొరుగు వారిని తికమకలు పెట్టుచుందురు
భక్తి జీవితంబులందు చిచ్చులాటలు
ప్రభుని చేర ప్రార్ధించగ త్వరపడరేల ||కడవరి ||
Verse 4
ప్రతివారు తనకు తాను చూచుకొనకయే
పరులమీద పలునిందలు వేయుచుందురు
పరుల బాధలను చూచి సంతసింతురు
పరముచేర భాగ్యము పొందకుందురు ||కడవరి ||