Verse 1
నా యేసు ప్రభువా - నా నిజదైవమా
నా ప్రాణ ప్రియుడా - నా జీవ నాధుడా
ఆశ్రయ దుర్గమా - రక్షణ శృంగమా
నీ రెక్కల చాటుననే దాగియుందును
Verse 2
పాపకూపాన పడియున్న నన్ను - ప్రేమించినావు నాదరి చేరినావు
నీ కరము చాపి నన్ను పైకిలేపి - క్రీస్తనే బండపైన నను నిలిపినావు ||హల్లె ||
Verse 3
నా పాపములకు బలియైనావు - నా శాపములకు గురియైనావు
నా పాప శిక్షను నీవే భరించి - పాపక్షమాపణ నా కిచ్చినావు ||హల్లె ||
Verse 4
శ్రమలో నాకు అండగా నిలిచావు - శోధనలో నాకు బండగా నున్నావు
నీకు మొఱపెట్టగా నా మొఱ విన్నావు - నన్ను విడిపించి కృపజూపినావు ||హల్లె ||
Verse 5
నీ కృపలను నే నిత్యము తలచి - రక్షణపాత్రగ నీకై నిలచి
జీవిత కాలమంత నీకై సాక్షిగ - కృతజ్ఞత స్తుతులు చెల్లింతు ప్రభువా ||హల్లె ||
Verse 6
హల్లెలూయ - హల్లెలూయ హల్లెలూయ - హల్లెలూయ
హల్లెలూయ స్తుతి స్తోత్ర గీతాలతో కీర్తింతు నిన్ను ఎల్లప్పుడు