Verse 1
రెండు దారులు కలిసే చోట - గండమున్నది విను యేసు మాట
అటో ఇటో తేల్చుకో నీబాట
Verse 2
ఇది జీవము - అది మరణము - ఇది దీవెన - అది శాపము
ఏది కావలెనో - కోరుకో - ఇకనైనా మేలుకో ||రెండు ||
Verse 3
ఇది రక్షణ - అది తీర్పు - ఇది వెలుగు - అది చీకటి
అటో యిటో తేల్చుకో - తృటిలో బ్రతుకును మార్చుకో ||రెండు ||
Verse 4
ఇది మహిమ - అది యాతన - ఇది విజయం - అది పరాజయం
ఏది కావలెనో - కోరుకో - గమ్యము త్వరగా చేరుకో ||రెండు ||
Verse 5
ఈయన యేసు అతడు సైతాను ఈయన రక్షకుడు అతడు రాక్షసుడు
ఎవరు కావలెను నీకు - కోరుకొనుము భయపడకు ||రెండు ||