ప్రార్ధనే జీవము ప్రార్ధనే విజయము - జయ జీవితమును కోరువారికి
పరలోకనాధుని దివ్య చట్టము
పాపవిమోచన కలిగించుటకై - ప్రభుసన్నిధికి నడిపించుటకై
శతృమూకపై జయమొందుటకై - నిత్యజీవమునకు నడిపించుటకై ||ప్రార్ధనే ||
బుద్ధి జ్ఞానముల వృద్ధి చేయుటకు - శుద్ధి చేసి సంసిద్ధ పరచుటకు
దిద్దుబాటును కోరిన వారికి - ప్రార్ధనే ఒక అద్భుతాయుధము ||ప్రార్ధనే ||
శక్తిని నిచ్చును ప్రార్ధన - స్వస్థత నొసగును ప్రార్ధన
వ్యక్తిని మార్చును ప్రార్ధన - ముక్తిని నిచ్చును ప్రార్ధన
ఆత్మతో నింపును ప్రార్ధన - అభిషేకము నిచ్చును ప్రార్ధన
నిక్కముగ చేపట్టిన వారికి - ఆ పరలోకమే ఈ భూవిపై దింపును ||ప్రార్ధనే ||
పద్యం: భక్తుల మొరవిని అద్భుతములు చేయువాడు దేవుడు
లోకమును కదిలించు సాధనము ప్రార్ధనే
నేటి ప్రార్ధనా వీరుడే రేపటి పరలోక పౌరుడు
పవిత్ర జీవితానికి ప్రార్ధనయే జీవనాడి ||ప్రార్ధనే ||