Verse 1
యేసుతో ఈ జీవితం - ఎంతో ఆనందం
యేసుతో ఈ జీవితం - ఎంతో మాధుర్యం
Verse 2
సహవాసిగా సహకారిగా - సహోదరుడై సమీప బంధువై
సజీవుడై సదా నాతో - ఉన్న యేసుతో జీవితం ||యేసు ||
Verse 3
ప్రాణప్రియునిగా పరమ విభునిగా - ప్రాణమిత్రుడై నా పోషకుడై
సజీవుడై సదా నాతో - ఉన్న యేసుతో జీవితం ||యేసు ||
Verse 4
కన్నతల్లిగ కన్న తండ్రిగ - కంటిపాపలా కాపాడువాడుగ
సజీవుడై సదా నాతో - ఉన్న యేసుతో జీవితం ||యేసు ||
Verse 5
నా రక్షకుడై నా రక్షణకై - రక్తముకార్చి నను రక్షించి
సజీవుడై సదా నాతో - వున్న యేసుతో జీవితం ||యేసు ||