Verse 1
మరనాత మహిళ - మరనాత మహిళ - మరనాత మహిళ
ఇదే ఏసు పిలుపు ఇదే ఏసు పిలుపు-హోసన్నా హల్లెలూయ - 2 || మరనాత ||
Verse 2
నిరాశ నిస్పృహలు ఎన్ని వచ్చినా
దీక్షతో నడిచెదం ఏసునామంలో - 2
అపవాది అగ్నిబాణముల్ ఎన్నివిసిరినా
అదరక బెదరక మనం ముందుకు సాగెదం ||హోసన్న ||
Verse 3
చూడుము భూమిమీద పాపచీకట్లు
విసిగి వేసారిన జీవితాలను - 2
రక్షణాగీతాలు మనం పాడెదం
జీవవాక్యం చేబూని ఏసునామంలో సాగెదం ||హోసన్నా ||
Verse 4
కదంత్రొక్కి పదంపాడి ముందుకుసాగెదం
అగ్నిజ్వాలలమై ముందుకుసాగెదం
సార్వభౌమ శక్తితో - సిలువ త్యాగ స్ఫూర్తితో - 2
క్రీస్తుసైన్యమై మనం ముందుకు సాగెదం ||హోసన్నా ||
Verse 5
చీకు చింతలు వున్నవారికై
వ్యాధులు బాధలు వున్నవారికై
కన్నీటి ప్రార్ధనా - స్వస్థతా ప్రార్ధనా
క్రీస్తు నేర్పిన ప్రార్ధన మనం చేసెదం ||హోసన్నా ||