జగతికి పునాది వేయకముందే జనియించిన ప్రేమ
జగతిలో నేను పుట్టకముందే నన్నెరిగిన ప్రేమ
నన్నెరిగిన ప్రేమ ఏర్పరచుకున్న ప్రేమ
నన్నెరిగిన ప్రేమ నన్నెన్నుకున్న ప్రేమ
గర్భమున పుట్టినది మొదలు నన్ను భరించిన ప్రేమ
తల్లిఒడిలో కూర్చున్నది మొదలు చంకబెట్టిన ప్రేమ
చిరు ప్రాయము నుండి ముసలితనము వరకు
ఎత్తుకున్న ప్రేమ హత్తుకున్న ప్రేమ - 2 ||జగతికి ||
దూరస్థునిగ ఉన్నప్పుడు నను సంధించిన ప్రేమ
దారి తొలగి తిరిగిన యపుడు - నను సమకూర్చిన ప్రేమ
మార్గము చూపించి - మందలో నను చేర్చె
సంధించిన ప్రేమ సమకూర్చిన ప్రేమ
సంధించిన ప్రేమ సమకూర్చిన ప్రేమ ||జగతికి ||
రక్షణ పాత్రను అందించ రక్తము కార్చిన ప్రేమ
ముండ్లను శిరమున ధరియించి మకుటము నిచ్చిన ప్రేమ
నిరుపేదగ నిలిచి నను ధనవంతుని చేసే
రక్షించిన ప్రేమ రక్తము చిందించిన ప్రేమ
రక్షించిన ప్రేమ రక్తము చిందించిన ప్రేమ ||జగతికి ||