Verse 1
భువియందలి చీకటి తొలుగా
ఉదయించెను ఆకశాన తార
మానవులకు రక్షణ కలుగా
అరుదెంచెను రక్షకుడేసు || భువి ||
Verse 2
దూతసైన్యము జయధ్వనులు చేయ
జనులందరు ఆనందముతో పాడ
మరియ కన్నులలో కాంతులు విరియ ||భువి ||
Verse 3
జ్ఞానులు శక్తితో ఆరాధించ
పామరులే ధన్యతతో గాంచ
యేసుని గాంచిన హృదయాలే ఉప్పొంగా ||భువి ||
Verse 4
యేసు చెంతకు నీవచ్చినన్
నీకు సమస్త దీవెన కలుగున్
నీ ఆశలు యేసు నెరవేర్చున్