Verse 1
పాపపు జగతిని మార్చాలని - తనవెలుగును ప్రజలకు పంచాలని
తండ్రిమాటతో పరమునువీడి - దూతగణముతో ఇహముకు చేరి
బోసినవ్వులతో వెలుగులుచల్లి - భారబ్రతుకులో మధురత నింపి
తనవారిగా మనలను చేయగా - జన్మించె క్రీస్తేసుడు
ఎలుగెత్తి పాడు - హ్యాపీ హ్యాపీ క్రిస్మస్
ప్రణమిల్లి వేడు - మెర్రీ మెర్రీ క్రిస్మస్ - 6
Verse 2
గొఱ్ఱెల కాపరులు పసియేసురాజును పూజింపగా
ఘనులైన జ్ఞానులు కానుకలర్పించి కొనియాడగా
ప్రియతల్లి మరియ యేసయ్య మురియ
పరలోక గీతాలు పాడిందిగా
మనమూ కూడి - ఆత్మతో పాడి - ప్రభువును స్తుతియింతుము ||ఎలుగెత్తి ||
Verse 3
క్రీస్తేసు రాజు నీహృదయమందు జన్మించెనా
నూతన సృష్టిగ నీ జీవితం మార్పొందెనా
క్రీస్తేసు జననం సార్ధకమయ్యేది నీ మార్పుజరిగిన నాడేనని - 2
గ్రహియించి నీవు మోకాళ్ళూని ప్రార్ధించు ప్రభుయేసుని ||పాపపు ||