Verse 1
శుభవేళ మీకు శుభవేళ - ఇలమాకు ఎంతో సంతసము
కళ్యాణ ఘడియలలో ప్రభు యేసు దీవెనలు
Verse 2
కానా పెండ్లి విందు అలరారే ప్రభు కృపలో
వరుడు వధువుల బంధం ఫలియింప ప్రభు ప్రేమలో
ఈ జంట వెయ్యేళ్ల పంటై శోభిల్లు నవవరమై ||శుభవేళ ||
Verse 3
ప్రేమాభిమాన ధనులై మెలగాలి ఒక హృదిగా
రాగాను బంధపు లతలై ఎదగండి ఒక జతగా
మీలోనే వర్ధిల్లు సిరులు కనరాని సంపదగా ||శుభవేళ ||
Verse 4
రారాజు యేసు వేచే పరిశుద్ధ కన్యకకై
మురిపించె మీ చిన్న స్నేహం - ఆదర్శ సంఘముగా
వెలుగొంది కలకాల మిలలో పొందండి దీవెనలు ||శుభవేళ ||