Verse 1
ప్రభువా పంపుమా - ప్రభువా నింపుమా
మారిపోయే లోకములో - మారిపోని నీ వార్త
కలసి చాటెదం నా దేవా కలిసి వెళ్ళెదం
మారిపోని నీ ప్రేమన్ మహిలో చాటెదం
Verse 2
చెలరేగె పాపం మరణాంధకారం - అపవాది మోసం ఆశించె లోకం
కన్నులెత్తి చూచి కన్నీళ్ళతో విత్తి - కలసి కోసెదము కలసి పాడెదము ||ప్రభువా ||
Verse 3
చల్లారిపోయె తొలినాటి ప్రేమ - నులి వెచ్చనాయె అలనాటి సేవ ||కన్నులెత్తి ||
Verse 4
ఆత్మలకై భారం అణగారి పోయె - లోకాశలన్నీ పెనవేసినాయి ||కన్నులెత్తి ||