Verse 1
నీవే నాదైవము - నీవే నా ధైర్యము జగతిలోన - వెదకి చూచిన
ఎవ్వరు నీకిల సమరూపము - ఎవ్వరు నీకిల సమతూకము || నీవే ||
Verse 2
ప్రేమ పవిత్రత నీ సాధనము - అదియే నాకిల మూలధనము - 2
పాపిని నను క్షమియించినదీ - పరిశుద్ధునిగా మార్చినది - 2
జీవమునిచ్చి క్షేమ మార్గమున తీరము వరకు నడుపునది - 2
సరిమా రిమపా మపనీ పనిసా - సరిమా రిమపా మపనీ పనిసా
సారిసారిసని నీసనీసనిప - పానిపానిపమ సానిపమరిస ||నీవే ||
Verse 3
ప్రభువా నీవే నాకిల ఆస్థి - పాప నేస్తంతో ఇకపై స్వస్థి - 2
శుద్ధ జలముతో కడిగితివి - నూతన హృదయము నిచ్చితివి - 2
రాతి గుండెను తీసివేసి - జీవాత్మను నాలో నుంచితివి - 2
సరిమా రిమపా మపనీ పనిసా - సరిమా రిమపా మపనీ పనిసా
సారిసారిసని నీసనీసనిప - పానిపానిపమ సానిపమరిస ||నీవే ||