Verse 1
మారని ప్రేమ ఆరని ప్రేమ
మరువలేని మార్పులేని క్రీస్తుయేసుని ప్రేమ
Verse 2
ఉన్నతంబగు క్రీస్తుప్రేమ ఊహకందని ప్రేమ
కన్నతల్లిని మించిన ప్రేమ క్రీస్తుయేసుని ప్రేమ క్రీస్తు కల్వరి ప్రేమ ||అది ||
Verse 3
మంటి పురుగును కంటిపాపగా కాచెనేసుని ప్రేమ
కంఠభూషణములను తొడిగిన క్రీస్తు యేసుని ప్రేమ క్రీస్తు కల్వరి ప్రేమ ||అది ||
Verse 4
కుసుమకోమల వధువుగా నను సిద్ధపరచిన ప్రేమ
శ్రేష్ట పరిమళ ద్రవ్యములతో నన్నుచేరిన ప్రేమ క్రీస్తు కల్వరి ప్రేమ ||అది ||
Verse 5
అది కల్వరి ప్రేమ కరుణించిన ప్రేమ
ఘోరపాపిని చేరదీసిన నేరమెంచని ప్రేమ