Verse 1
ఎవరు అగముల నణచువారో - ఎవరు జగతిని ఏలువారో
ఎవరు దురితముల్ త్రుంచువారో - ఎవరు జ్ఞానమైయున్నవారో
ఆయనే క్రీస్తేసు దైవము - ఆయనే ఆమోక్ష మార్గము - 2
ఇహమునందు పరమునందు ఎవరు తనసమము
Verse 2
మృతుల సహితమును లేపిన పరమాత్ముడు
గాలిసంద్రపు హోరును అణచిన యజమానుడు
నీదెట్టిశోధనైనా - ఏలాంటి వ్యాధినైనా- క్రీస్తే తీర్చును ||ఎవరు ||
Verse 3
పాపరోగులను మార్చిన కృపపూర్ణుడు
అంధకారపు బ్రతుకులో వెలుగుతానైయున్నవాడు
నీవెట్టివానివైనా - నీకెట్టిచింతలైనా - క్రీస్తే తీర్చును ||ఎవరు ||