Verse 1
ఆశ్ఛర్యకరుడైన దేవా - ఆదిసంభూతుడైన నాధా
నిన్ను ఏమని కొలుతును దేవా - నిన్ను ఏమని పొగడెద ప్రభువా
Verse 2
మొండిలా ఉన్ననన్ను కదిలింప జేశావు - ఎండిపోయిననన్ను చిగురింపజేశావు - 2
నీపనికై పరుగిడుదున్ నీనామము కీర్తింతున్ - 2
సృష్టికర్తవు నీవేనంటూ జనులకు చాటింతున్ ||స్తుతులూ ||
Verse 3
అర్హతలేనినన్ను ఆత్మతో నింపావు - అధముడనైననను అభిషేకించావు - 2
కరములు చాచితిని నిన్నేవేడితిని - 2
ముక్తిదాతవు నీవేనంటూ సాక్షిగ జీవింతున్ ||స్తుతులూ ||
Verse 4
స్తుతులూ స్తోత్రములు నీకే ఏసయ్యా
మహిమ ప్రభావములు నీకే మెస్సయ్యా