Verse 1
కృంగిపోకు ఓమనసా - నీవు కృంగి పోకు ఓమనసా
శరణం వేడుము ఓ మనసా - యేసు చరణం చేరుము ఓ మనసా
Verse 2
అలల వంటి శ్రమలవైపు చూడకు ఓమనసా
ఆదరించే వారు లేరని కృంగకు ఓమనసా - 2
నీ యజమానుడు యేసువైపు చూడుము ఓమనసా - 2
నిత్యం చూడుము ఓమనసా - 2 ||కృంగి ||
Verse 3
క్షయమై పోయె లోకం వైపు చూడకు ఓమనసా
అక్షయమగు ఆరాజ్యం వైపు చూడుము ఓమనసా
రానైయున్న యేసువైపు చూడుము ఓమనసా - 2
నిత్యం చూడుము ఓమనసా - 2 ||కృంగి ||