Verse
దాగున్నావా నీవు దాగున్నావా సంఘాన్ని చెడిపేవాడా
నీవు నా కనులను దాయగలవు గానీ
ఆ దేవుని కళ్ళను దాయలేవుగా
Verse
పలుకుతావు నీవు పరిశుద్ధ మాటలు
చేస్తావు నీవు సాతాను క్రియలు‖ 2x ‖
ఈ లోకపు దృష్టిలో పరిశుద్ధుడవైనా
పరలోకంలో నీ స్థానమేమిటో
Verse
తోటివానిపైన నీకెందుకయ్య కోపం
ఆ కోపం పైవానికి ఎందుకయ్యభారం‖ 2x ‖
నీ కాలం చెల్లునాడు నీతోడు రాడు
ఎందుకయ్యనీకింకా వానితో గోడు
Verse
పాడు పదవిపైనా నీకెందుకయ్యమోహం
ఆ మోహంలో బ్రతుకు బలౌతుంది ఖాయం‖ 2x ‖
పదవి అనే పదనిసలో ప్రభుని మరచినావో
పరలోకంలో నీ పేరు మాయమౌను