Lyrics Lake
SearchLyricsTags
  1. Home
  2. /
  3. Lyrics
  4. /
  5. Daahamu Teerchumayya Abhishekamu Neeyumayya

దాహము తీర్చుమయ్యా అభిషేకము నీయుమయ్యా

Daahamu Teerchumayya Abhishekamu Neeyumayya

Chorus
దాహము తీర్చుమయ్యా - అభి - షేకము నీయుమయ్యా - మాదు
Verse
వేదము పూర్వము తెలిపిన విధమున - నీ దాసుల నాత్మతో నింపి
కరుణసాగరా బీదలమగు మము - కరుణించు మిపుడే - మాదు
Verse
శత్రువు చేత సహించరాని - కష్టము లేన్నో కల్గినను
దేవా నీదుకృప బలముచే - నవిరత జయమభ్భున్ - మాకు
Verse
వేదపుసారము భోధించునట్టి - భోధకుడా పరుశుద్ధాత్ముడా
పాదశరణము వేడినట్లయిన - పరిశుద్దు లయ్యెదము - మేము
Verse
శుద్ధ జీవితము పరిశుద్ధ సేవయు - శుద్ధునికి హితమగు కానుకలు
పరిశుద్ధ చిత్తప్రకారము దయనొంది - ఫలమును చూచెదము - మేము

Related Tags

WorshipPrayerHoly Spirit