Lyrics Lake
SearchLyricsTags
  1. Home
  2. /
  3. Lyrics
  4. /
  5. Daahamugala Vaarellaru Neellayodhaaku Raarandi

దాహముగల వారెల్లరు నీళ్ళయొదాకు రారండి

Daahamugala Vaarellaru Neellayodhaaku Raarandi

Chorus
దాహముగల వారెల్లరు - నీళ్ళయొద్దకు రారండి
Verse
దేవుని నది నీళ్ళతో నిండి - భువికి సారము నిచ్చుచున్నది - రారండి
దేవుని దీవెనల వలన నీవు తృప్తి పొందెదవు
Verse
ఆనంద ప్రవాహ నదిలో - పానముతో దప్పి తీర్చును రారండి
భూనివాసులు దాహముతో - ప్రాణము విడుచుచున్నారు
Verse
మంచితనముతో వత్సరమునకు మకుటము ధరింప చేసెను - రారండి
మహిమతో నిండిన తన మార్గములో - మేలులు ప్రవహింప జేసెను
Verse
ప్రయాసభారము మోయువారు - యేసు నొద్దకు ఆశతోడను - రారండి
తీసివేయును మీ భారము - నొసగు మీకు విశ్రాంతి
Verse
సకలము సిద్ధముగా నున్నది - శక్తిగల దేవుని విందునకు - రారండి
సహవాసంబున భుజించును - చేర్చుకొనిన క్రీస్తు ప్రభుని
Verse
సత్యమును తెలిపెను ప్రభువు - ప్రత్యేక జీవము జీవింపను - రారండి
ప్రత్యక్ష పరచెను తన వెలుగు - నిత్యము యేసుతో జీవించుడి
Verse
దేవుని నది జీవజల నది - ప్రవహించుచున్నది పల్లమునకు - రారండి
దేవుని కృప పూర్ణతను బొందగ - నీవును విధేయుడవై యుండుము

Related Tags

InvitationSalvationLiving Water