Chorus
దానియేల్వలె సాహసించుడి యొంటరిగా నిల్వ దానియేల్వలె
సాహసించుడి దానియేల్వలె సాహసించుచు జ్ఞానులై దృఢ కార్యముఁ
గలిగి దీనులై యా దృఢ కార్యం బిఁకఁ బూని తెల్పను సాహసించుడి‖ దానియేల్ ‖
Verse
నిక్కమగు కార్యమునందు నిలిచి దైవాజ్ఞ లెలఁ గ్రక్కున గైకొను
జనములగాంచి చక్కఁగ వారిని ఘనపర్చుచు సంతతము నెనరుఁ పించుచు
మిక్కిలి దానియేల్సంఘమును మెచ్చుచు నంగీకరించుఁడీ‖ దానియేల్ ‖
Verse
ధారుణిపైని నగరములలో మరణించిరిగా కడు శూరులనఁబడువా
రనేకులు వారు దానియేల్సంఘమును గని కోరి యేకీభవించినమది
వారలే ప్రభుదేవుని భట పరి వారమునఁబడి యుందురు నిజ మిఁక‖ దానియేల్ ‖
Verse
కాన నీ సువిశేషమును జెండ పైకెత్తుఁడీ సై తానుని నెదిరించను రండి
దీనిని దీని శ్రేణులను యు ద్ధానికి రారమ్మని పిలిచి దానియేల్సంఘము
పక్షమునఁ బూని జయధ్వనులనుఁ జేయుటకై‖ దానియేల్ ‖