Verse
దాపుఁజేరుచుఁ బాడుము
జీవపు మాటలన్
మాధుర్యంబగు గానము
మరలఁ బాడుము
జీవమైన పాటన్
త్రోవఁజూపు మాటన్
|| సుందర మానందముగన్‖ సుందర మానందముగన్ ‖
సొంపుగఁ బాడుము ||
Verse
నిత్యజీవము నిచ్చెడు
నిపుణుఁ డేసుఁడు
సత్యప్రేమ నొసంగెడు
సదయుఁ డేసుఁడు
మితిలేని ప్రేమ
మింటికాకర్షించున్.
Verse
ప్రచురపర్చుఁ డెల్లడన్
ప్రభుని రక్షణన్
దాచఁగూడని సత్యమున్
పూర్ణ క్షమాపణన్
రక్షకుని చెంత
ఆశతోడ రండు