Lyrics Lake
SearchLyricsTags
  1. Home
  2. /
  3. Lyrics
  4. /
  5. Daari Thappi Pothunnaavaa Vishwaasi

దారి తప్పి పోతున్నావా విశ్వాసి

Daari Thappi Pothunnaavaa Vishwaasi

Verse
దారి తప్పి పోతున్నావా విశ్వాసి
తీరమేదో గమనించావా విశ్వాసి‖ 2x ‖
ఈ లోకం ముళ్ళ బాట
విశ్రాంతి లేని చోట‖ 2x ‖
యేసయ్యే జీవపు బాట
సాగిపో ఆయన వెంట‖ 2x ‖
యేసుతో నీవొస్తావా విశ్వాసి
లోకం విడిచి రానంటావా విశ్వాసి‖ 2x దారి ‖
Verse
ఓడలోని నల్ల కాకి
చూడ నేర్చే ఈ లోకాన్ని‖ 2x ‖
చూడ చూడ లోకపు రుచి
ఓడ మరచిపోయే కాకి‖ 2x ‖
కాకిలా నీవుంటావా విశ్వాసి
పావురంలా తిరిగొస్తావా విశ్వాసి‖ 2x దారి ‖
Verse
ఓడలోనున్ననాడు
యేసు నీకు తోడుంటాడు‖ 2x ‖
ఆశ్రయంబుగా ఉంటాడు
ఆశలన్నీ తీరుస్తాడు‖ 2x ‖
యేసులో నీవుంటావా విశ్వాసి
సంఘమందు చేరుంటావా విశ్వాసి‖ 2x దారి ‖

Related Tags

FaithChristian LifeGuidance