Lyrics Lake
SearchLyricsTags
  1. Home
  2. /
  3. Lyrics
  4. /
  5. Daasula Praarthana Dhappaka Yesangedu

దాసుల ప్రార్థన దప్పక యెసఁగెడు

Daasula Praarthana Dhappaka Yesangedu

Lyricist: Purushothamu Choudari
Chorus
దాసుల ప్రార్థన దప్పక యెసఁగెడు యేసు నాయకుఁడై మా వేల్పు
దోసములు సేయు దుర్జనుఁడైనను దోసి లొగ్గఁ బర వాసి జేయునఁట‖ దాసుల ‖
Verse
జన రహిత స్థల మున జని వేఁడెడి మనుజుల ప్రార్థన వినుచుండున్
తన పాదము న మ్మిన సాధూత్తమ జనులను జూచిన సంతస
మిడునఁట‖ దాసుల ‖
Verse
మది విశ్వాసము గూడిన ప్రార్థన సదయత వినుటకుఁ జెవు లొగ్గున్
హృదయము కనుఁగొని యుచిత సమయమున గుదురుగ భక్తుల
కోర్కె లిచ్చునట‖ దాసుల ‖
Verse
ముదమున నిద్దరు ముగ్గురు నొకచోఁ బదిలముగాఁ దనుఁ బ్రార్ధింపన్
వదలక దానట వచ్చి యుందు నని మృదువుగఁ బలికిన కృత
రక్షణుఁడట‖ దాసుల ‖

Related Tags

WorshipPrayer