Chorus
దాతృత్వమును గలిగి పెరుగుదమ ధనము ధాత్రి దేవుని దంచు నెఱుగుదమ‖ దాతృ ‖
Verse
శక్తికొలఁది కాన్కలర్పింతమ మన భుక్తినుండి కొంతఁ దీయుదమ‖ దాతృ ‖
Verse
సంతోషముగ నియ్య సాగుదమ మన స్సంతటితోఁ జేయ నేగు దమ‖ దాతృ ‖
Verse
గర్వఘనములు వీడి యర్పింతమ యుర్వి సర్వ మాయనందు నేర్పింతమ‖ దాతృ ‖
Verse
సంఘ సేవకు సొమ్ము సమకూర్తమ క్రీస్తు సంఘ యక్కఱ లన్ని తీర్చుదమ‖ దాతృ ‖
Verse
ప్రతియాదివార మిది మది నుంతమ దీని ప్రతి సంఘస్థుఁడు చేయ బోధింతమ‖ దాతృ ‖
Verse
విధిఁ దలఁచి దుర్బలుల రక్షింతమ సంఘ విధవాళి దానముతో దర్శింతము‖ దాతృ ‖
Verse
దిక్కులేని జనుల దీవింతమ వారి యక్కఱలలో మేలుఁ గావింతమ‖ దాతృ ‖
Verse
పుచ్చుకొనుటకంటె నిచ్చుదమ మఱల నిచ్చు తండ్రికి స్తుతుల నిచ్చెదమ‖ దాతృ ‖
Verse
వెదజల్లి యభివృద్ది పొందుదమ మోక్ష పదవు లను భవింపఁ బరుగిడుదమ‖ దాతృ ‖
Verse
వర్ధిల్లిన కొలది చెల్లింతము లోక వ్యర్థ ఖర్చులనెల్ల మళ్లింతమ‖ దాతృ ‖