Lyrics Lake
SearchLyricsTags
  1. Home
  2. /
  3. Lyrics
  4. /
  5. Daaveedu Thanayaa Hosannaa

దావీదు తనయా హోసన్నా

Daaveedu Thanayaa Hosannaa

Chorus
హోసన్నా…
హోసన్నా హోసన్నా హోసన్నా‖ 3x ‖
అయ్యా.. దావీదు తనయా హోసన్నా
యూదుల రాజా యేసన్నా‖ 2x ‖
హోసన్నా హోసన్నా – యేసన్నా యేసన్నా‖ దావీదు ‖
Verse
గిరులు తరులు సాగరులు
నీకై వీచెను వింధ్యామరలు
హోసన్నా హోసన్నా – యేసన్నా యేసన్నా
గిరులు తరులు సాగరులు
నీకై వీచెను వింధ్యామరలు
పిల్లలు పెద్దలు జగమంతా‖ 2x ‖
నీకై వేచెను బ్రతుకంతా‖ దావీదు ‖
Verse
కరుణా రసమయ నీ నయనాలు
సమతా మమతల సంకేతాలు
హోసన్నా హోసన్నా – యేసన్నా యేసన్నా
కరుణా రసమయ నీ నయనాలు
సమతా మమతల సంకేతాలు
కంచర వాహన నీ పయనాలు‖ 2x ‖
జనావాహినికే సుబోధకాలు‖ దావీదు ‖
Verse
పేదల పాలిటి పెన్నిధివై
పాపుల రక్షకుడైనావు
హోసన్నా హోసన్నా – యేసన్నా యేసన్నా
పేదల పాలిటి పెన్నిధివై
పాపుల రక్షకుడైనావు
మకుటము లేని ఓ మహరాజా‖ 2x ‖
పరిచితిమివిగో మా హృదయాలు‖ దావీదు ‖

Related Tags

PraiseWorshipHosanna