Verse
దైవ ఇష్టమే గాలికే ఉంది తెలుసునా…
దైవ చిత్తమే ఇష్టమని నెరవేర్చునని తెలుసునా…
శబ్దమే చేస్తుంది – వచ్చానని ముందే తెలుపుతుంది
సంచారం చేస్తుంది – సర్వలోకమంతా తిరుగుతుంది
ఆత్మ మూలంగా జన్మించిన ప్రతివాడు ఇలా ఉంటాడు
సర్వలోకానికి సంచారం చేస్తాడని యేసు చెప్పాడు
Verse
ప్రాణం నిలబెడుతుంది వాయువుగానే ఉంది అది….. నీ కోసమని
పుడుతున్నావని తెలిసి బ్రతికించాలని వచ్చిందీ….. దేవునికిష్టమని
కనిపించకుండా అది సేవ చేస్తుంది – కనిపించని దేవుడు ఉన్నాడని చెపుతుంది
అన్నిటికీ నేనవసరమని చెపుతుంది – ఈ భువిపై అందరికీ ఉపయోగపడింది
దేవుడు చెప్పగా సంద్రం పాయలు చేసింది- యేసు మాటకు మిక్కిలి నిమ్మలమైపోయింది
శబ్దమే చేస్తుంది – వచ్చానని ముందే తెలుపుతుంది
సంచారం చేస్తుంది – సర్వలోకమంతా తిరుగుతుంది
దైవ ఇష్టమే గాలికే ఉంది తెలుసునా…
దైవ చిత్తమే ఇష్టమని నెరవేర్చునని తెలుసునా…
Verse
పాపిని రక్షించుటకు నలుదిక్కులకు వెళతాడు….క్రైస్తవుడు అని
దేవుని ఇష్టం ఎక్కడ ఉంటే అటువైపెలతాడు …… తనలాగే అని
తన పనికొరకు వేగముగా వెళతాడు – రాత్రనక పగలనక తిరుగుతూ ఉంటాడు
నమ్మకపోతే శిక్షుందని చెపుతాడు – నమ్మినవారికి యేసే రక్షకుడంటాడు
దేవుడు చెప్పిన మాటను ప్రకటిస్తుంటాడు – కనిపించని మాటకు శబ్ధం వినిపిస్తూ ఉంటాడు
శబ్దమే చేస్తుంది – వచ్చానని ముందే తెలుపుతుంది
సంచారం చేస్తుంది – సర్వలోకమంతా తిరుగుతుంది
ఆత్మ మూలంగా జన్మించిన ప్రతివాడు ఇలా ఉంటాడు
సర్వలోకానికి సంచారం చేస్తాడని యేసు చెప్పాడు
దైవ ఇష్టమే గాలికే ఉంది తెలుసునా…
దైవ చిత్తమే ఇష్టమని నెరవేర్చునని తెలుసునా..