Verse
దైవ కుటుంబం ధరణిలో దేవుని ప్రతిబింబం‖ 2x ‖
శాంతి సంతోషాలకు అది నిలయం
ఆప్యాయత అనురాగాలకు ఇక ఆరంభం‖ 2x ‖
విశ్వాసపు వాకిళ్ళు పరిశుద్ధత లోగిళ్ళు‖ 2x ‖
ఆతిథ్యమిచ్చే వంటిల్లు వర్ధిల్లు నూరేళ్ళు‖ 2x ‖
దైవ కుటుంబపు సంతోషం
కని విని ఎరుగని ఆనందం‖ 4x దైవ కుటుంబం ‖
Verse
రక్షణ పొందిన కుటుంబం మోక్ష పురికి సోపానం
క్రమశిక్షణ కలిగిన కుటుంబం వీక్షించు దైవ సాన్నిధ్యం‖ 2x ‖
అపార్ధాలు అంతరాలు లేనట్టి అన్యోన్యత
షడ్రుచుల ఘుమఘుమలు గుభాలించు మా ఇంట‖ 2x ‖
అష్టైశ్వర్యాలకు తూలతూగే కుటుంబం‖ 2x ‖
తరతరాలు వర్ధిల్లే కుటుంబం‖ 2x దైవ కుటుంబపు ‖
Verse
మమతలు కలిగిన కుటుంబం సంతృప్తినిచ్చే కుటుంబం
ధాన్య ధన వస్తు వాహనాలు కావు మా యింటి కంభాలు‖ 2x ‖
భయభక్తులు దేవోక్తులు మా అన్న పానాలు
మా యొక్క నట్టింట్లో వసియించును దేవుడు‖ 2x ‖
పెనవేసుకున్న బంధాలే ఈ కుటుంబం‖ 2x దైవ కుటుంబపు ‖