Lyrics Lake
SearchLyricsTags
  1. Home
  2. /
  3. Lyrics
  4. /
  5. Daiva Prema Pruthviloni Yannitini Minchunu

దైవ ప్రేమ పృథ్విలోని యన్నిటిని మించును

Daiva Prema Pruthviloni Yannitini Minchunu

Verse
దైవ ప్రేమ పృథ్విలోని - యన్నిటిని మించును
ఏసు మాలో నివసించు - మది మా విముక్తియే
నీ కమూల్య ప్రేమయుండు - నీవు ప్రేమమూర్తివే
నీ దాసులమైన మమ్ముఁ గృపతో రక్షించుము
Verse
మమ్ము సమ్రక్షించు శక్తి - నీకుండు మా ప్రభువా
యెన్నఁ డెన్నఁ డేని నీదు - సన్నిధిని బాయము
నిన్ స్తుతించుచుండి మేము - సర్వదా సేవింతుము
నిన్ బ్రార్థించి పూర్ణ ప్రేమ - మే మతిశయింతుము
Verse
క్రొత్తగా మమ్ము సృజించి పాపమెల్లఁ బాపుము
మాకు స్వస్థత నొసంగి - గొప్ప రక్షణ జూపుము
భక్తి యభివృద్ధి పొంది - స్వర్గమందుఁ జేరఁగా
వింతనొంది ప్రేమ స్తుతి - నీ కర్పింతు మెపుడు

Related Tags

WorshipSalvationGods Love