Verse 1
దైవ తనయా క్రీస్తు నాథుండా అయ్యా
పాపులకై ప్రాణమిచ్చితివా
దేవుడే నిను పంపినాడా‖ దైవ ‖
Verse 2
పాపులకై వచ్చినావా
పాపులను కరుణించినావా‖ 2x ‖
ప్రాణదానము చేసినావా – దేవా
పరలోకము తెరచినావా‖ దేవుడే ‖
Verse 3
కల్వరిలో కార్చినట్టి
దివ్యరక్తముచే మమ్ము‖ 2x ‖
కడిగి పావన పరచినావా – దేవా
కడుగు బూరతో రానై యున్నావా‖ దేవుడే ‖
Verse 4
మరణము జయించినావా
మరణముల్లు విరచినావా‖ 2x ‖
మహిమతోడ లేచినావా – దేవా
మాదు చింతలు దీర్చినావా‖ దేవుడే ‖
Verse 5
ధరణిలో అతి దుష్టులముగా
దారి తెలియక దూరమైతిమి‖ 2x ‖
ధరణికే ఏతెంచినావా – దేవా
ధన్యులనుగా జేసినావా‖ దేవుడే ‖
Verse 6
ఆదియంతము లేనివాడా
అందరికిని దేవుడవు‖ 2x ‖
అల్ఫయు ఓమేగయు నీవేగా – యేసు
ఆర్భటించుచు రానై యున్నావా‖ దేవుడే ‖