Lyrics Lake
SearchLyricsTags
  1. Home
  2. /
  3. Lyrics
  4. /
  5. Daivakutumbam Dharanilo Devuni Prathibimbam

దైవకుటుంబం ధరణిలో దేవుని ప్రతిబింబం

Daivakutumbam Dharanilo Devuni Prathibimbam

Chorus
దైవకుటుంబం ధరణిలో దేవుని ప్రతిబింబం‖ 2x ‖
శాంతి శంతోషాలకు అది నిలయం
ఆప్యాయత అనురాగాలకు ఇక ఆరంభం‖ 2x ‖
విశ్వాసపు వాకిళ్ళు పరిశుద్ధత లోగిళ్ళు‖ 2x ‖
ఆతీధ్యమిచ్చే వంటిల్లు వర్ధిల్లు నూరేళ్ళు‖ 2x ‖
దైవకుటుంబపు సంతోషం కని విని ఎరుగని ఆనందం‖ 4x దైవకుటుంబం ‖
Verse
రక్షణ పొందిన కుటుంబం మోక్ష పురికి సోపానం
క్రమశిక్షణ కలిగిన కుటుంబం వీక్షించు దైవ సాన్నిధ్యం‖ 2x ‖
అపార్ధాలు అంతరాలు లేనట్టి అన్యోన్యత
క్షడ్రుజుల ఘుమఘుమలు గుభాలించు మా ఇంట‖ 2x ‖
అష్టైశ్వర్యాలకు తులతూగే కుటుంబం‖ 2x ‖
తరతరాలు వర్ధిల్లే కుటుంబం‖ 2x దైవకుటుంబపు ‖
Verse
మమతలు కలిగిన కుటుంబం సంతృప్తినిచ్చే కుటుంబం
ధాన్య ధన వస్తు వాహనాలు కావు మా యింటి కంభాలు‖ 2x ‖
భయభక్తులు దేవోక్తులు మా అన్న పానాలు
మా యొక్క నట్టింట్లో వసియించును దేవుడు‖ 2x ‖
పెనవేసుకున్న బంధాలే ఈ కుటుంబం‖ 2x ‖

Related Tags

BlessingFamilyChristian Home