Lyrics Lake
SearchLyricsTags
  1. Home
  2. /
  3. Lyrics
  4. /
  5. Daivaprema Manalanepudu Bandhinchuga Da

దైవప్రేమ మనలనెపుడు బంధించుగా ద

Daivaprema Manalanepudu Bandhinchuga Da

Lyricist: ఎ చార్లెస్ కిన్సింగర్
Chorus
దైవప్రేమ మనలనెపుడు బంధించుగా దివిని భువిని దీన జనులను
దిరముగా కాపాడుగా‖ దైవ ‖
Verse
పరమతండ్రి గద్దెముందట ప్రార్థనల్ మరిజేతుము పలు విధముల
మార్గములలో ప్రభువే తోడైయుండుగా‖ దైవ ‖
Verse
నిత్యప్రభువు సత్యసేవను నిరతమును మదినుంతుము నిలిచియుందుము
క్రీస్తుకొరకై నిత్యసేవక జనముగా‖ దైవ ‖
Verse
మనము విడిచి వెళ్లునపుడు మదిని కల్గును వేదన మనసు హృదయము
కలిసియుండగ మరల గలియుదు మెచ్చటో‖ దైవ ‖
Verse
జనక తనయ పరిశుద్ధాత్మకు జయము మహిమయు ఘనతయు ఆదినుండి
యిపుడు యెపుడు అవని పరమున జెల్లుగా‖ దైవ ‖

Related Tags

PrayerProtectionGods Love