Lyrics Lake
SearchLyricsTags
  1. Home
  2. /
  3. Lyrics
  4. /
  5. Dashamu Bhaagamu Lella Devunivi Dhaara

దశము భాగము లెల్ల దేవునివి ధారా

Dashamu Bhaagamu Lella Devunivi Dhaara

Lyricist: Kuchipudi Rajaratnamu
Chorus
దశము భాగము లెల్ల దేవునివి ధారాళముగ నియ్య సమకూడుఁడి
పశువులు పైరులు దేవునివి పసిఁడి లోహపుగనులు దేవునివి భాగ్యభోగ్యము
లెల్ల దేవునివి భావించి కానుకలను నియ్యుఁడి‖ దశమ ‖
Verse
దేవునివి దొంగలించెదరా దేవదేవుని మోసపుచ్చెదరా భావించి మది
నెంచి భయము నెంచి ప్రార్ధింపఁ దలవంచి ప్రభు భాగమున్
దేవాలయంబును పూర్ణంబుగా దేదీప్యముగా నుండ సమకూర్చుఁడీ‖ దశమ ‖
Verse
పరిశుద్ధ దేవుని మందిరముఁ పరిపూర్ణముగాను యోచించుఁడీ పరిశుద్ధ
భాగము విడఁదీయుఁడీ పాడిపంటలు నాస్తి దేవునిని పదియవ భాగంబు
దేవునివి పరమాత్మ దీవెనలను బొందుఁడీ‖ దశమ ‖
Verse
ప్రథమ ఫలంబులు దేవునివి విదితంబుగా నీయ మది నెంచుఁడీ
సదమల హృదయములను బొందియుఁ ప్రథమ భాగము నెల్ల విడఁదీసియు
ముదమున దేవునికర్పించుఁడీ సదయు దీవెనలొంద సమకూర్చుఁడీ‖ దశమ ‖
Verse
ఆకసపు వాకిండ్ల విప్పుదును అధిక కృపలను గుమ్మరించుదును మీ
కష్టఫలములను దీవింతును భీకర నాశంబుఁ దొలఁగింతును మీ కానంద
దేశ మిత్తు నని శ్రీకరుం డెహోవా సెల విచ్చెను‖ దశమ ‖
Verse
దినభోజనం బిచ్చు దేవునిని ఘన సౌఖ్యముల నిచ్చు దేవునిని
వినయంబుతో మదిని ధ్యానించుచు దినభోజనంబులను భాగించుచు
మానక దేవుని కర్పించు డీ ఘనసేవ జయమొందు పని బూనడీ‖ దశమ ‖

Related Tags

OfferingStewardshipTithe