Verse 1
పాపిని యేసుప్రభో - నేపాపిని యేసుప్రభో
నీరక్తపు ధారలచే - నను కడుగుము యేసుప్రభో
Verse 2
నీవు పవిత్రుడవు నే నపవిత్రుడను
నీ రక్త ప్రభావముచే పవిత్రుని జేయు ప్రభూ ||పాపిని ||
Verse 3
చిందిన రక్తమున నే బొందితి స్వస్థతను
సంధించుము యాత్మతో నిష్ కళంకునిజేయు ప్రభూ ||పాపిని ||
Verse 4
మంటిని నేను ప్రభూ గనుగొంటిని నీ కృపలన్
రాకుంటిని నీ దరికిన్ మన్నించుము యేసుప్రభూ ||పాపిని ||