Verse 1
సర్వాధిపతికేస్తుతి - సర్వోన్నతునికే మహిమ
వేవేల దూతాళిచే - పాడబడు ప్రభుకేస్తుతి
Verse 2
గాఢాంధకారములో - వెలుగు కమ్మని పలికెను
చీకటి బ్రతుకులలో - వెలుగు జీవము కలుగ
తనతోడ బ్రతికించెను ||సర్వాధిపతికే ||
Verse 3
చెదరిపోయిన గొఱ్ఱెను - వెదకి తన దరిచేర్చెను
సదయుడై ఓదార్చి - తనదు మందలో జేర్చి
మంచి కాపరియాయెను ||సర్వాధిపతికే ||
Verse 4
కంటనీటిని తుడిచెను - నోటస్తోత్రము నుంచెను
అల్పజీవిని నాలో - అద్భుతములే జేసి
తనకు సాక్షిగా నిలిపెను ||సర్వాధిపతికే ||