Verse 1
నరకమనునది నిరతముండునయో
ఆ ఘోర నరకమునందు పాపులు బాధపడుదురయో
మరియు నగ్నిగంధకములును - మండుచుండును తరుగులేకను
ధరణి కాదది దరియుకానదు - మరణ మెదకిన దొరకదందున || నరక ||
Verse 2
గప్పుగప్పున రగులు చుండునయో ఆఘోరనరకము
నిప్పులెగయుచు పొంగుచుండునయ్యో
మబ్బువలె పొగ పైకిలేచును - అబ్బా అబ్బాయని ఏడ్చుచుందురు
బొబ్బలిడుదురు - అడ్డమొచ్చెడి అబ్బలెవ్వరు కానరారు ||నరక ||
Verse 3
నోరునెత్తి కొట్టుకొందురయో - ప్రభు యేసు క్రీస్తును
నమ్మనందున నొచ్చుకొందురయో
పురుగు చావదు - అగ్ని ఆరదు కొరకు చుందురు పండ్లు పటపట
తిరిగి తిరిగి చూచుచుందురు - పరుగులెత్తి ఏడ్చుచుందురు