తన రెక్కల క్రింద ఆశ్రయము - తన రెక్కలతో కప్పును
మహోన్నతుని యందు - విశ్రమించి యుండెడివాడు
సర్వశక్తుని నీడను - వసియించు వానికి పరమ శ్లాఘనీయము ||తన ||
ప్రభువే నా ఆశ్రయము - నాకోటయు దుర్గమును
ప్రభువే సత్యము - ప్రభువే డాలు - ప్రభువే నా నమ్మకం ||తన ||
రాత్రి భయము నుండి - పగటి బాణమునుండి
చీకటిలో తిరిగెడు తెగులునకైనా - నేను భయపడను ||తన ||
పదివేల మంది - నీ ప్రక్కన పడినను
అపాయము నీ యొద్దకు రాదు - నీ దేవుడె దయజూపును ||తన ||
దేవుడె ఆశ్రయము - చెడుగు నిన్ను నడిపించదు
యే తెగులు నీ గృహంబునకు - రాకుండగ కాపాడును ||తన ||
నీదు మార్గంబులో - నిను దూతలు కాయును
నీ పాదమునకు రాయి తగులకుండ - ఎత్తెదరు చేతులతో ||తన ||
నీవు సింహంబులను - నాగుపాములనణచెదవు
ఆయన నామమును నమ్మిన నిన్ను - విడిపించి కాపాడును ||తన ||
ఆయనకాపదలో మొర్రపెట్టినపుడే - నను తప్పించెను
ఆత్మీయ మిత్రుడై నను రక్షించెను ||తన ||