Verse 1
నీవే నా సామర్ధ్యం - నీవు లేని బ్రతుకే వ్యర్ధం
నిన్ను కల్గిన జీవనం - ఇలలో నాకు సార్ధకం సాఫల్యం
Verse 2
నీ క్రియలన్నియు ధ్యానించుచున్నాను
నీ చేతుల పనిని యోచించుచున్నాను - 2
నీ తట్టు నా చేతులు చాపుచున్నాను - 2
నీయందు నేను నమ్మికయుంచాను - నడచి వస్తున్నాను ||నీవే నా ||
Verse 3
నీవైపు నామనసు ఎత్తుకొనుచున్నాను
నిన్ను ప్రకటించు మార్గము తెరువుము - 2
శత్రువు చేతినుండి నన్ను విడిపించుము - 2
చిత్తము చొప్పున నన్ను నడిపించుము నన్ను నడిపించుము ||నీవే నా ||
Verse 4
భువిపై నాకున్న కాలము క్షణికం నాపై నీకున్న ప్రేమ అధికం
అర్పింతును దేవా నీకే సర్వస్వం
నీ కృపలో నన్ను నడుపుము నిరతం నడుపుము నిరతం ||నీవే నా ||