పరలోక దేవుని పిల్లలం - మేము భారతీయులం
ఆరని జీవన జ్యోతులం - విశ్వాస వీరులం
హల్లెలూయా - హల్లెలూయా - హల్లెలూయా - 2
పాతరోత బ్రతుకులన్ విడిచిన వారం - హల్లెలూయా
నూతన జన్మము నొందిన వారం - హల్లెలూయా
పరిశుద్ధాత్మను పొందిన వారం - హల్లెలూయా
ప్రభు యేసు సువార్తను చాటెడి వారం - హల్లెలూయా ||పరలోక ||
అందచందం లేని వారం - హల్లెలూయా
అందమైన యేసుని పొందినవారం - హల్లెలూయా
ఆత్మల భారం కల్గిన వారం - హల్లెలూయా
ఆత్మీయనాధుని చాటెడి వారం - హల్లెలూయా ||పరలోక ||
కల్వరి నాధుని పిల్లలం మేము - హల్లెలూయా
కాంతులను వెదజల్లెడి వారం - హల్లెలూయా
సాతాను యుక్తుల నెరిగిన వారం - హల్లెలూయా
సాతాను రాజ్యం కూల్చే వారం - హల్లెలూయా ||పరలోక ||
యేసు కార్చెను రుధిరం కల్వరిగిరిలో - హల్లెలూయా
ప్రాణం బెట్టెన్ పాపి నీ కొరకై - హల్లెలూయా
పాపశాపమునే తొలగించే యేసు - హల్లెలూయా
పాదాల చెంతకు వేగమే రండి - హల్లెలూయా ||పరలోక ||