Verse 1
నా దాగు చోటువై అవ్యాజ ప్రేమ చూపు నా ఆశ్రయ దుర్గమా
నా కన్న తండ్రివై చంకపెట్టుకున్న ఓ యెహోవా దైవమా
నీకే నీకే శ్రేష్ఠభావములతో హృదయపూర్వక స్తోత్రార్పణ ||2||
నీ ప్రేమకై నా యేసయ్య నా జిహ్వతో సంకీర్తన ||2||
Verse 2
జ్ఞానమే కొదువైన బాలుని రీతిగా - వృద్ధిలేక దీనముగా పడియుండగా
శుద్ధమైన నడవడిలోపించగా
ఆత్మతో అభిషేకించి జీవితాన్ని రమ్యముగా దిద్దినావయా
నీకే నీకే శ్రేష్ఠభావములతో హృదయపూర్వక స్తోత్రార్పణ -2
నీ ప్రేమకై నా యేసయ్య నా జిహ్వతో సంకీర్తన -2
Verse 3
నీటికై ఎదురుచూసే గూడబాతులా
ఆత్మకై నిరీక్షించి వేచి యుండగా
అలసిన కన్నులతో చూచుచుండగా
అగ్నిలా మంచులా పెనుగాలిలా
నీఆత్మను కుమ్మరించి కృపచూపితివి
నీకే నీకే శ్రేష్ఠభావములతో హృదయపూర్వక స్తోత్రార్పణ -2
నీ ప్రేమకై నా యేసయ్య నా జిహ్వతో సంకీర్తన -2 ||నా దాగు చోటువై ||