క్రైస్తవ కర్షక కదలి రావయ్యా - కన్నులు తెరచి కానవేమయ్యా
కోతకాలము గతించిపోయె - గ్రీష్మకాలము కూడ జరిగిపోయె
మనుష్య కుమారుడైన క్రీస్తు యేసు - మంచి విత్తనమును విత్తేమున్ను
భూలోకంబనెడు పొలంబునందున - వాక్యంబనే విత్తనంబు విత్తెను ||క్రైస్తవ ||
ఆదిమ క్రైస్తవ బోధకులు - వేదనతోను వాక్యంబు విత్తి
రోదనతోను రక్తంబును కార్చి - ప్రాణంబులను దానంబుచేసిరి ||క్రైస్తవ ||
చల్లిన వాక్యము ఫలియింపను - తొలకరి వర్షం కురిపించెను
విలువైన ఫలములు ఫలియించు వరకు కడవరి వర్షము కొరకు వేడుదం ||క్రైస్తవ ||
పొలములు తెల్లబారె తేరిచూడు - కాలము చాల గతించిపోయె
కోత యజమానుడైన క్రీస్తుని - కోతవారిని బంపకోరి వేడుదం ||క్రైస్తవ ||
శత్రువగు సాతాను కూడ - చెడ్డ విత్తనములు చల్లిపోయె
గోధమల మధ్య గురుగులు కూడ - ఘోరంబు గాను పెరుగుచుండెను ||క్రైస్తవ ||
కన్నీళ్లతో విత్తు క్రైస్తవుండ - కలవర మొందెద వెందులకు
సంతోషముతో సంగీతాలతోను - సాగి పోవుదం ఆగిపోకను