Verse 1
మహిమగలరాజా నాయేసు మహిమగలరాజా
సర్వోన్నతమైన స్థలములలో - నీకే మహిమ నీకే మహిమ
మహిమ మహిమ నా యేసుకే - మహిమ మహిమ నా యేసుకే
Verse 2
నన్ను ప్రేమించి నీరక్తముచేత - నా పాపము నుండి విడిపించినావు
అవధులు లేని నీ కృపచేత - నీలో నన్ను ఆశీర్వదించావు
సాగిలపడెదను యుగయుగములు - 2 ||మహిమగల ||
Verse 3
లెమ్ము నీవు తేజరిల్లుమని - నీమహిమ నామీద ఉదయింపజేశావు
అన్యజనములు నీవెలుగునకు - వచ్చెదరని నను ఆశీర్వదించావు
ప్రకాశింతును నీ మహిమలో.... - 2 ||మహిమగల ||